Header Banner

తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా! కార్పొరేటర్ల కిడ్నాప్ ఆరోపణలతో..!

  Mon Feb 03, 2025 21:58        Politics

నేడు జరగాల్సిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు బుధవారానికి వాయిదా పడ్డాయి. వైసీపీ, కూటమి పార్టీల మధ్య తీవ్రస్థాయి ఘటనల నేపథ్యంలో, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఎల్లుండి (ఫిబ్రవరి 5) నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ప్రకటించారు. ఎన్నికలు నిర్వహించాలంటే 26 మంది కార్పొరేటర్లు హాజరు కావాల్సి ఉండగా, 23 మంది కార్పొరేటర్లే అందుబాటులో ఉండడంతో ఎన్నికలు వాయిదాపడ్డాయి.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!  


కూటమి నేతలు తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని, తమపై దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ కార్పొరేటర్లు వస్తున్న బస్సును అడ్డుకున్నారని, తమ కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్లేందుకు యత్నించారని ఎంపీ గురుమూర్తి ఆరోపణలు చేశారు. బస్సు టైర్లకు గాలి తీసేసి, తాళాలు లాగేసుకున్నారని వివరించారు. ఇంత జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఎంపీ గురుమూర్తి వెల్లడించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #thirupathi #deputymeyir #elections #todaynews #flashnews #latestupdate